ప్రభాస్ ని అలా చూపిస్తా త్రివిక్రమ్
Trivikram Intresting Comments On Prabhas
ఆరడుగుల ఆజానుబాహుడు, మాస్ కటౌట్ ప్రభాస్ ని చాలామంది దర్శకులు మాస్ ఇంకా యాక్షన్ అవతార్ లో చూపించేందుకు ఇష్టపడతారు కానీ.. ఆయన లోని కామెడీ యాంగిల్ ని పూర్తిగా వాడుకునే ఆలోచన ప్రస్తుతం ఏ దర్శకుడు చెయ్యడం లేదు. మారుతి రాజసాబ్ తో ఏదో కామెడీ యాంగిల్ తో ప్రభాస్ ని ఒప్పించాడు కానీ.. అది ఏ కోశానా వర్కౌట్ అవ్వలేదు.
అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభాస్ ని పూర్తి హ్యూమరస్ కేరెక్టర్ లో చూపించాలని ఉంది అంటూ జయంబు నిశ్చయంబు రా సీజన్ 2 లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ షో లో జగపతి బాబు ర్యాపిడ్ ఫైర్ అంటూ అడిగిన ప్రశ్నల్లో చిరు, బాలయ్య, ప్రభాస్ లను ఎలా చూపించాలనుకుంటున్నారు అని అడిగారు.
ప్రభాస్ కామెడీ టైమింగ్ బావుంటుంది. ఆయన నటించిన బుజ్జిగాడు లో ప్రభాస్ కామెడీ యాంగిల్ బావుంటుంది, నేను ఆయన్ను పూర్తి స్థాయి హ్యుమరస్ పాత్రలోనే చూపిస్తాను. సరైన కథ, పాత్ర ఉంటే ప్రభాస్ కామెడీ టైమింగ్‌ను మరింత అద్భుతంగా తెరపై ఆవిష్కరించే అవకాశం ఉందని త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
















































