BB బజ్: శివాజీ దెబ్బకు ఏడ్చేసిన షాలిని
Bigg Boss Buzzz Shalini Exit Interview
బిగ్ బాస్ లో విపరీతమైన నెగిటివిటీతో హౌస్ నుంచి బయటికి వచ్చిన షాలిని పటేల్ బిగ్ బాస్ బజ్ లో శివాజీ అడిగిన ప్రశ్నలకు దెబ్బకి ఏడ్చేసింది. బయట ఆడియన్స్ ఏమనుకునున్నారో అదే షాలిని కి ప్రశ్నలు సంధించాడు హోస్ట్ శివాజీ. నువ్వు హౌస్ లో ఏం చేసావో చెప్పు. బిగ్ బాస్ నుంచి వార్నింగ్ లు, హోస్ట్ నుంచి హెచ్చరికలు, టాస్క్ లు ఆడరు, ఎప్పుడు చూడు గుసగుసలు, మిగతా హౌస్ మేట్స్ తో గొడవలు ఇదే నువ్వు హౌస్ లో చేసింది అన్నాడు శివాజీ.
దానికి షాలిని మమ్మల్ని వాళ్ళంతా టార్గెట్ చేసారు, చరణ్, సృష్టి వెళ్లిపోవడంతో మేము లో అయ్యాం, అయినా ఆడినం అంది. ఎక్కడమ్మా నీ గేమ్, పడుకున్నప్పుడు తప్ప నువ్వు రోహిత్ కలిసే ఉన్నారు, అసలు మీ మధ్యన ఎందుకు అన్ని గుసగుసలు, నువ్వు అరవడం తప్ప ప్రశాంతంగా మాట్లాడిన సందర్భమే లేదు.
సీక్రెట్ రూమ్ కి వెళ్లొచ్చిన వాళ్లలో ఒకరు విన్నర్ అయ్యారు, మరొకరు రన్నర్ అయ్యారు, నువ్వు మాత్రం వెళ్లిన వీకే బయటికొచ్చావ్ అంటూ షాలినిని ఎడా పెడా శివాజీ ఏసుకోవడంతో షాలిని ఏడ్చేసింది.. అన్న మీకు ఓపెన్ గా చెబుతున్నా హౌస్ లో ఎంత ధైర్యంగా పోరాడినా.. మిగతా వాళ్ళు మమ్మల్ని బాగా టార్గెట్ చేయడంతోనే ఇలా..
అన్ని తెలుసుకుని రియలైజ్ అయ్యేలోపు బయటికి వచ్చేసా, బిగ్ బాస్ నాకో లెసన్ అంటూ రోహిత్ తో ఉన్న బాండింగ్ పై ఇండైరెక్ట్ గా శాలిని స్పందించిన తీరు ఆమె రోహిత్ లవ్ లో ఉంది అని ఫిక్స్ అవుతున్నారు.
















































