గాడ్ ఆఫ్ వార్ పై త్రివిక్రమ్ క్రేజీ కామెంట్స్
Trivikram's crazy comments on God of War
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్నేహితుడు సునీల్ తో కలిసి సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్ గా జీ తెలుగులో ప్రసారమవుతున్న జయంబు నిశ్చయంబు రా సీజన్ 2 కి వచ్చారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ ఇంకా సునీల్ లు పంజాగుట్ట రూమ్ లోని విశేషాలు, ఆలాగే ఆర్పీ పట్నాయక్ తో ఉన్న అనుబంధం పై చేసిన కామెంట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
హోస్ట్ జగపతి బాబు.. వెంకీ కాంబోలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వచ్చాయి. అవి మంచి హిట్స్, ఇప్పుడు మీ కాంబోలో రాబోతున్న ఆదర్శ కుటుంబం కామెడీనా లేదంటే యాక్షన్ సినిమానా అని అడిగితే.. దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్.. మర్డర్ కామెడీ అంటూ క్లారిటీ ఇచ్చారు. వెంకీ కి ఈ కథ చెప్పగానే నచ్చేసింది అంటూ ఆదర్శ కుటుంబం పై త్రివిక్రమ్ హైప్ పెంచేశారు.
ఇదే ఎపిసోడ్ లో త్రివిక్రమ్ ను తారక్ తో చెయ్యబోయే గాడ్ ఆఫ్ వార్ గురించి చెప్పమని అడగానే.. గాడ్ ఆఫ్ వార్ కు సంబంధించి స్క్రిప్టింగ్ చాలా వరకు పూర్తి చేసిట్లు చెప్పిన త్రివిక్రమ్ దానిని తారక్ కు కూడా వినిపించినట్లుగా చెప్పారు. ప్రీ లుక్ పోస్టర్ లో శ్లోకం గురించి చెప్పిన త్రివిక్రమ్ నాకు శబ్ద జ్ఞానం లేదు. పదాల అర్థం తెలియదు. పద్యాలు రచించడం రాదు.. అయినప్పటికీ ఆరు ముఖాల నా మనసులో లోకి రాగానే నా నోటి నుంచి మాటలు వాటంత అవే వెలువడ్డాయి..
ఇదంతా ఆయన సంకల్పమే అంటూ త్రివిక్రం పైకి చూస్తూ అంతా దైవ సంకల్పమే అన్నట్టుగా గాడ్ ఆఫ్ వార్ పై జయంబు నిశ్చయంబు రా షో లో చేసిన కామెంట్స్ విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
















































