ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kayadu Lohar Replaces Sreeleela in Ajith's AK64?

శ్రీలీల చేజారిన క్రేజీ ప్రాజెక్ట్

Kayadu Lohar Replaces Sreeleela in Ajith's AK64?Kayadu Lohar Replaces Sreeleela in Ajith's AK64?


శ్రీలీల కు ప్రస్తుతం సౌత్ లో ముఖ్యంగా తెలుగులో గడ్డుకాలం మొదలైంది. విజయాలతో సంబంధం లేకుండా తెలుగులో యువ హీరోలతో వరసగా ఛాన్స్ లు రాబట్టిన ఈ క్యూట్ బ్యూటీ కి ఆ చిత్రాలు బిగ్ షాక్ లు తగిలేలా చేసాయి. ప్రస్తుతం శ్రీలీల కు తెలుగులో ఆఫర్స్ లేవు. కానీ తమిళనాట అమ్మడుకి సక్సెస్ తో సంబంధం లేకుండా ఛాన్స్ లు వస్తున్నాయి.

ధనుష్ ఓం లో నటిస్తున్న శ్రీలీల కు అజిత్ కుమార్ డేర్ డెవిల్ లో ఆఫర్ వచ్చింది అనే టాక్ ఎప్పటి నుంచో మీడియా సర్కిల్స్ లో నడుస్తుంది. కానీ తాజా సమాచారం ప్రకారం అజిత్ సినిమా ఛాన్స్ శ్రీలీల చేజారినట్లుగా సమాచారం. శ్రీలీల ని అనుకున్న ప్లేస్ లో కాయదు లోహర్ ని డేర్ డెవిల్ టీమ్ తీసుకుంటున్నారట.

మరి తమిళనాట విజయాలతో పని లేకుండా శ్రీలీల కు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు అనుకుంటే.. ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్, అలాగే క్రేజీ స్టార్ అజిత్ మూవీ ఛాన్స్ కోల్పోవడం శ్రీలీల కు నష్టమనే చెప్పాలి. ప్రస్తుతం శ్రీలీల హిందీ ప్రాజెక్ట్స్ ల్లో బిజీగానే కనబడుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో శ్రీలీల హిందీ డెబ్యూ విడుదలకు సిద్దమవుతుంది. 

Kayadu Lohar reportedly going to play the female lead in Ajith Dare Devil