బిగ్ బాస్ 10: అమన్, నరేష్ కన్నీళ్లు
Bigg Boss Telugu 10: Aman Wins GOAT Title
బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ వారం బిగ్ బాస్ పెట్టిన గొట్ టాస్క్ లో రెడ్, ఎల్లో, గ్రీన్ లెవల్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ పోటీపడగా.. రెడ్ బాక్స్ లో ఉన్న రాంప్రసాద్ మొదటి టాస్క్ లో గెలిచి ఎల్లో లెవల్ కి వెళ్ళాడు. ఇక గ్రీన్ లెవల్ కోసం హౌస్ లో ఉన్న అమన్, త్రిగుణ, నీతూ, దేబ్జానీ, రాంప్రసాద్, నరేష్, శివ్, ముఖేష్ గౌడ, వర్షిణి లు టాస్క్ ఆడారు.
ఈ టాస్క్ హౌస్ మేట్స్ తో ఉన్న బాండింగ్ తో జరిగింది. ఈ ఛాలెంజ్ లో హౌస్ మేట్స్ సపోర్ట్ తో ఎంతసేపు వెయిట్ మోస్తారో అనేది ఈ టాస్క్. దానిలో ఒక్కో కంటెస్టెంట్స్ కి ఒక్కో గ్రూప్ సపోర్ట్ చేసింది. వెయిట్ మొయ్యలేక ముందుగా వర్షిణి పడిపోయింది. అలా హౌస్ మేట్స్ సహకారం లేని వారు ఎక్కువ వెయిట్ మోస్తూ పడిపోవడం.. హౌస్ లో ఎక్కువగా రాంప్రసాద్, నరేష్ కి సపోర్ట్ చేసారు.
అయితే అమన్ కి ముఖేష్ వెయిట్ వెయ్యడానికి వస్తుంటే అమన్ పడేసి వెళ్ళిపోతాడు, తర్వాత ఈ టాస్క్ లో నరేష్ గెలుస్తాడు, దానితో హౌస్ లో ఎవరూ తనకు సపోర్ట్ లేరు అని అమన్ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు, కానీ బిగ్ బాస్. హౌస్ మేట్స్ మొత్తం కలిసి నరేష్ కి వెయిట్ వెయ్యకుండా చేసారు. ఇది ఫెయిర్ గేమ్ కాదు.
ఈ టాస్క్ లో గెలిచింది నరేష్ కాదు అమన్ అని బిగ్ బాస్ ప్రకటించాడు. దానితో నరేష్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇక దేబ్జానీ, నీతులు ఏ టాస్క్ లో ఎక్కువసేపు నిలబడ్డారు అని బిగ్ బాస్ స్పెషల్ గా వారిని గ్రీన్ లెవల్ కి పంపించాడు. వారు గ్రీన్ లెవల్ కి వెళ్లి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి కెప్టెన్సీ కంటెండర్లు గా ఇమ్యూనిటీ సాధించారు.
















































