చిన్ననాటి ఫోటోతో సమంత డీప్ రిఫ్లెక్సన్స్
Samantha Ruth Prabhu shares childhood picture
నటి సమంత వ్యక్తిగత ప్రయాణం, ఆత్మవిశ్వాసం , స్వీయ-విలువ గురించి పంచుకున్న ఓ హృదయపూర్వక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చిన్ననాటి అరుదైన ఫోటోను షేర్ చేస్తూ గతం నుంచి తాను నేర్చుకున్న పాఠాలు, ఎదుగుదల గురించి రాసుకొచ్చిన మాటలు స్ఫూర్తినిస్తున్నాయి. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికీ ఈ పోస్ట్ చక్కటి సందేశాన్ని ఇస్తోంది.
ఈ సందర్భంగా సమంత పర్ఫ్యూమ్ బ్రాండ్ 120 కోట్ల రెవెన్యూ మైలురాయిని దాటిందనే వార్తకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను కూడా సమంత పంచుకున్నారు. `యూనివర్స్ చిన్న సహాయంతో` అంటూ ఆమె తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తన స్వశక్తిని నమ్ముకోవడానికి, తగిన అవకాశాలు దక్కతాయని నమ్మడానికి తనకు చాలా ఏళ్లు పట్టిందని పేర్కొన్నారు. నిరంతరం కష్టపడాలనే తపనతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు.
సమంత పోస్ట్‌లో తనను తాను పరిమితం చేసుకున్న సరిహద్దులను చెరిపివేసి స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నానని తెలిపారు. `నీ శక్తిని నమ్ముకోవడానికి నీకు చాలా కాలం పట్టింది. నువ్వు ఎక్కడా ఆగిపోకుండా కష్టపడ్డావు. ఈ ప్రయాణంలో నువ్వు సాధించిన విజయాల గురించి గర్వపడాలి` అంటూ బాల్యపు జ్ఞాపకాలను ప్రస్తుత స్థాయిని ముడిపెట్టారు. జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి సవాల్ తనను మరింత బలపడేలా చేసిందని వివరించారు.
















































