ఉర్ఫీ ఫ్యాషన్‌పై అంజలి ఫోగట్ బోల్డ్ కామెంట్స్
Anjali Phougat bold comments on Urfi's fashionఫ్యాషన్ ప్రపంచంలో ప్రయోగాత్మక డిజైన్లు చూడటానికి అందంగా ఉన్నాయా లేక విచిత్రంగా ఉన్నాయా అనే కోణంలో మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న భావన ..అమలు ఆధారంగా విశ్లేషించబడాలని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ,నటి అంజలి ఫోగట్ అభిప్రాయపడ్డారు. కేవలం పైపైన కనిపించే రూపాలను చూసి దుస్తులను అందమైనది లేదా విచిత్రమైనది అని తేల్చిపారేయడం కంటే ఆ డిజైన్ వెనుక డిజైనర్ ఆలోచన ఏంటి? ఆ ఆలోచనను వస్త్రం రూపంలో ఎంతవరకు సమర్థవంతంగా తీసుకువచ్చారు అనేది పరిశీలించడం ముఖ్యమని నొక్కిచెప్పారు.
ఈ సందర్భంగా కాన్స్ 2025 వేదికపై నటి ఉర్ఫీ జావెద్ ప్రదర్శించిన రోజ్-ఇన్స్పైర్డ్ లుక్‌ను అంజలి ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక మొగ్గ దశ నుంచి పువ్వు పూర్తిగా వికసించే క్రమాన్ని ఆ దుస్తుల ద్వారా స్పష్టమైన విజువల్ నేరేటివ్‌గా ప్రదర్శించారని ప్రశంసించారు. ఆ శిల్పకళా శైలిలోని రేకులు, అద్భుతమైన ఎంబ్రాయిడరీ మరియు డ్రమాటిక్ వాల్యూమ్ ఆ డిజైన్‌కు అద్భుతమైన థియేట్రికల్ రూపాన్ని తెచ్చిపెట్టాయని కొనియాడారు. కేవలం ప్రదర్శన కోసమే కాకుండా ఇలాంటి సృజనాత్మక ఆలోచనల్లో వేరబులిటీ కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
సృజనాత్మకతకు తగిన నైపుణ్యం కూడా తోడైతేనే అద్భుతాలు సృష్టించవచ్చని అంజలి తన ఫ్యాషన్ తత్త్వాన్ని వివరించారు. `ఒక కాన్సెప్ట్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తే దాని వెనుక ఉన్న అద్భుతమైన నైపుణ్యం అందరి గౌరవాన్ని సంపాదించి పెడుతుంది` అని పేర్కొన్నారు. సిల్హౌట్, ఫ్యాబ్రిక్, కన్‌స్ట్రక్షన్ , స్టైలింగ్ వంటి పలు అంశాల ఆధారంగా ప్రయోగాత్మక డిజైన్లను అంచనా వేస్తామని చెబుతూ ఫ్యాషన్ రంగంలో క్రియేటివిటీతో పాటు క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ కూడా సమానంగా ముఖ్యమని స్పష్టం చేశారు.
















































