ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anupama Parameswaran celebrity crush is Mohanlal

ఆయనే నా సెలబ్రిటీ క్రష్: అనుపమ

Anupama Parameswaran celebrity crush is MohanlalAnupama Parameswaran celebrity crush is Mohanlal

 

దక్షిణాది చిత్రసీమలో క్యూట్ లుక్స్, నటనతో కుర్రకారు మనసు దోచుకున్న భామ అనుపమా పరమేశ్వరన్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనసులోని మాటను బయటపెట్టారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మాత్రమే తన జీవితంలో ఏకైక సెలబ్రిటీ క్రష్ అని అనుపమ బహిరంగంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు  మలయాళంతో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి.

మోహన్‌లాల్‌పై తనకున్న ఆరాధన గురించి మాట్లాడుతుంటే.. `మా ఇద్దరి మధ్య చాలా ఎక్కువ వయసు వ్యత్యాసం ఉందనే విషయం నాకు తెలుసు. కానీ నా చిన్నతనం నుంచి ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో నా ఏకైక క్రష్ మాత్రం మోహన్‌లాల్ గారే అని అనుపమ స్పష్టం చేశారు. ఆయన నటన, స్క్రీన్ ప్రజెన్స్ ,వ్యక్తిత్వం తానెంతో ఇష్టపడతానని  వివరించారు.

`ప్రేమమ్` సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ, ఆ తర్వాత తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఎంతమంది యంగ్ హీరోలతో నటించినప్పటికీ దిగ్గజ నటుడు మోహన్‌లాల్ పట్ల తనకున్న అభిమానం, క్రష్ ఎప్పటికీ ప్రత్యేకమైనదని చెప్పడం ద్వారా ఈ క్రేజీ బ్యూటీ మరోసారి వార్తల్లో నిలిచారు.

Anupama Parameswaran Reveals Mohanlal Is Her Only Celebrity Crush