RC17 లాంచ్ డేట్ రివీల్డ్

Here are RC 17 launch plansHere are RC 17 launch plans

 

రామ్ చరణ్-సుకుమార్ కలయికలో మొదలు కాబోయే RC17 ప్రాజెక్ట్ దసరా ఫెస్టివల్ సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలవుతుంది అని ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్ ఆ కార్యక్రమం జరగకపోయేసరికి నిరాశపడిపోయారు. తాజాగా RC17 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్ మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.

ఆయన మౌళి నటిస్తున్న దొంగ నా కొడకా సినిమా టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొనడంతో అక్కడ నిర్మాత రవి శంకర్ కు రామ్ చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్ మొదలయ్యే డేట్ పై ప్రశ్నలు ఎదురవగా.. ఆయన RC17 అక్టోబర్ 26 లేదా 27న మంచి ముహూర్తం చూసుకుని పూజ కార్యక్రమాలతో మొదలుపెట్టబోతున్నట్టుగా RC17 పై క్రేజీ అప్ డేట్ ని రివీల్ చేసారు.

సో మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వాల్సిందే. ఈ చిత్రం క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మీరు మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కబోతుంది. 

RC 17 launch plans revealed