ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sara Ali Khan recently visited the Golden Temple

గోల్డెన్ టెంపుల్ లో సారా అలీ ఖాన్ ఎమోషనల్!

Sara Ali Khan recently visited the Golden TempleSara Ali Khan recently visited the Golden Temple

బాలీవుడ్ యువ నటి సారా అలీ ఖాన్ పవిత్ర పుణ్యక్షేత్రమైన అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ (స్వర్ణ దేవాలయం)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో దైవ దర్శనం చేసుకుని  తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అక్కడి ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసిన సారా దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్న అరుదైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఆధ్యాత్మిక యాత్రతో పాటు, దసరా పండుగను పురస్కరించుకుని సారా అలీ ఖాన్ తన తోటి నటుడు ఆయుష్మాన్ ఖుర్రానాకు .. అభిమానులందరికీ ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న ఈ పోస్టులు  నెట్టింట వైరల్ అవుతున్నాయి. వృత్తిగతంగా ఎంతో బిజీగా ఉన్నా? సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను గౌరవిస్తూ సారా ఇలాంటి పవిత్ర స్థలాలను తరచుగా సందర్శించడం విశేషం.

విభిన్నమైన చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సారా అలీ ఖాన్, వ్యక్తిగత జీవి తంలోనూ ఎంతో నిరాడంబరంగా ఉంటారనే పేరుంది. గోల్డెన్ టెంపుల్ సందర్శన సందర్భంగా ఆమె చూపించిన భక్తి భావం, పండుగ వేళ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
 

Sara Ali Khan and Ayushmann Khurrana recently visited the Golden Temple