హీరో నాని ప్రిపేర్ అవ్వాల్సిందే!
Hero Nani needs to prepare!
నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ప్యారడైజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చిందో లేదో, సోషల్ మీడియాలో ట్రోలర్స్ అలెర్ట్ అవుతున్నారు. అంతేకాదు ట్రోలర్స్ హీరో నాని ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 24 న భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైన ది ప్యారడైజ్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి కనిపించింది.
ప్యారడైజ్ పై వచ్చిన ట్రోల్స్ ఈమధ్య కాలంలో మరో పెద్ద సినిమాపై రాలేదు. దానితో నాని వెంటనే రంగంలోకి ప్యారడైజ్ పై వస్తున్న ట్రోల్స్ ని తట్టుకునేలా మాట్లాడడమే కాదు పోస్ట్ ప్రమోషన్స్ తో ఎంతోకొంత నెగివిటిటీని నాని పోగొట్టాడు. కానీ ఇప్పుడు మరోసారి నాని ట్రోల్స్ ని ఎదుర్కొనేందుకు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సిన సమయం వచ్చింది.
ప్యారడైజ్ చిత్రం ఈనెల 22 న ఓటీటీలోకి రాబోతుంది. దానితో కొంతమంది సోషల్ మీడియాలో ఓటీటీ లోకి 22nd anta ga OTT release Ready ayipo kaaki bommaali @nameisnani అంటూ ట్వీట్ లు వేస్తున్నారు. అంటే థియేటర్స్ ట్రోలింగ్ అయిపొయింది, ఇక ఓటీటీ లో చూసాక చెయ్యబోయే ట్రోలింగ్ కోసం నాని ని సిద్ధం చేస్తున్నారు ట్రోలర్స్ .
















































