రకుల్ ప్రీత్ ఫెస్టివ్ వైబ్స్
Rakul Preet Singh looks stunning
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా లుక్స్ గురించి అభిమానులే కాదు యూత్ మొత్తం చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. గ్లామర్ షో కి కేరాఫ్ గా కనిపించే రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఈవెంట్స్ లో అయినా, లేదంటే పండుగల సందర్భంగా అయినా చాలా స్పెషల్ గా రెడీ అవుతుంది, ఆ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ప్రస్తుతం దసరా శరన్నవరాత్రులు సందర్భంగా రకుల్ ప్రీత్ ఫెస్టివ్ వైబ్స్ తో మెరిసిపోతుంది. మోడ్రెన్ చీర కట్టులో రకుల్ ప్రీత్ గ్లామర్ షో హైలెట్ అవుతోంది. లైట్ కలర్ శారీ లో, డిజైనర్ బ్లౌజ్ లో, హెవీ జుంకాలు పెట్టుకున్న రకుల్ ప్రీత్ ఫెస్టివ్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ మద్యన రకుల్ ప్రీత్ సింగ్ అలాగే ఆమె మామగారు, నిర్మాత వాసు భగ్నానీ పై ముంబై లో ఐటి అధికారుల దాడులు చెయ్యడం కలకలం సృష్టించగా.. రకుల్ ప్రీత్ మాత్రం తమపై ఎలాంటి ఐటి దాడులు జరగలేదని, అబద్ధపు ప్రచారాలు చెయ్యొద్దు అని ఫైర్ అయ్యింది.
















































