జైలర్ 2 కి నైజాం కలెక్షన్స్ తగ్గడానికి కారణం?

Jailer 2 Collections in Telugu StatesJailer 2 Collections in Telugu States


గత గురువారం విడుదలైన జైలర్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెస్తుంది. నిర్మాత నాగవంశీ జైలర్ 2 టాక్ తో ఫుల్ హ్యాపీ. ఆ ఊపులోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన నైజాం కన్నా ఆంధ్రలోనే కలెక్షన్స్ బావున్నాయని చెప్పారు.

దానికి కారణం ఏమిటి అంటే.. దసరా హాలిడేస్ కి హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. అటు దసరా సంబరాల కోసం తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు పయనమవుతారు, అంతేకాదు ఆంధ్ర వాళ్ళంతా దసరా హాలిడేస్ కి ఏపీ వైపు పరుగులు పెడతారు. దానితో హైదరాబాద్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది.

అసలు మాములుగా అయితే జైలర్ 2 కి వచ్చిన ఈ హిట్ టాక్ కి హైదరాబాద్ మల్టిప్లెక్స్ ల్లో ఈ వీకెండ్ లో టికెట్స్ బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉండి.. అప్పటికపుడు టికెట్ బుక్ చేసుకునేవారికి దొరికేవి కావు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జైలర్ 2 చూడాలి అంటే అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకునేలా థియేటర్లులో సీట్లు దర్శనమిస్తున్నాయి.

కారణం ఏపీ జనాలంతా హైదరాబాద్ వదిలి సొంత ఊళ్లకు పయనమవడంతో.. అక్కడి ఏపీ థియేటర్స్ కళకళలాడుతున్నాయి.  జైలర్ 2 కి నైజాంలో కలెక్షన్స్ తగ్గడానికి ప్రధాన కారణం దసరా నే.

Jailer 2 Collections