జైలర్ 2 ని లైట్ తీసుకున్నారు కానీ..
Jailer 2 vs Ranabaali : Box Office Performance
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 చిత్రం అక్టోబర్ 15 కి వస్తుంది అని తెలిసి, దసరా సెలవలు వర్కౌట్ అయ్యిపోతుంది అని విజయ దేవరకొండ రణబాలి చిత్రాన్ని ఒక్కరోజు గ్యాప్ లో అంటే అక్టోబర్ 16 న విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. దానితో సూపర్ స్టార్ జైలర్ 2 ఎఫెక్ట్ రణబాలి పై ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కనిపించిన ట్వీట్లు కావాలనే వేశారు, ఓ బ్యాచ్ ఉంటుంది రణబాలి ఏం చూస్తాం, జైలర్ 2కి పోదామంటూ ట్వీట్లు వేస్తారు వేసుకోండి అంటూ విజయ్ దేవరకొండ లైట్ గా మాట్లాడాడు.
గురువారం విడుదలైన జైలర్ 2పై ఎలాంటి అంచనాలు లేకపోయినా అద్భుతమైన టాక్ తెచ్చుకుని అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొడుతుంది. జైలర్ కి బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ అవడం రణబాలి పై ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు. అనుకున్నదే అయ్యింది. రణబాలి కి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి యావరేజ్ రెస్పాన్స్ కనిపిస్తుంది.
ప్రస్తుతం ఉన్న జైలర్ 2 హవా ముందు రణబాలి నిలబడుతుందా, సోషల్ మీడియాలో రణబాలి పై నెగెటివ్ ట్వీట్లు మొదలైపోయాయి. జైలర్ 2 ని రణబాలి మేకర్స్ విజయ్ దేవరకొండ లైట్ తీసుకుని తప్పు చేసారు అంటూ విజయ్ దేవరకొండ అభిమానులే మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
















































