అనుకున్నదే అయ్యింది - స్పిరిట్ డేట్ చేంజ్

Spirit new release is hereSpirit new release is here

 

అందరూ అనుకుంటున్నదే జరిగింది. ప్రభాస్ ప్రతి సినిమా వలే స్పిరిట్ కూడా రిలీజ్ డేట్ చేంజ్ చేసుకుంది. ప్రభాస్ సినిమాలు అనుకున్న సమయానికి రావు అనే మాటను స్పిరిట్ మేకర్స్ కూడా నిజం చేసి చూపించారు. ప్రభాస్ సినిమాలు ఆన్ టైమ్ కి రాకపోవడానికి ప్రభాస్ ఎంత కారణమో దర్శకులూ అంతే కారణం.

ఈ ఏడాది రాజాసాబ్ రిజల్ట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ తో ఎలాగైనా ప్రభాస్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశపడ్డారు. ఆ చిత్రము డిసెంబర్ 3 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసింది. అప్పటినుంచి స్పిరిట్ డేట్ కూడా మార్చ్ 5, 2027 నుంచి మారిపోతుంది అనే ఊహాగానాలు నడుస్తున్నాయి.

మరోపక్క సందీప్ రెడీ వంగ స్పిరిట్ ని ఆన్ టైమ్ లో తీసుకొచ్చేందుకు షూటింగ్ అనుకున్న ప్రకారమే చిత్రీకరిస్తున్నారు, ప్రభాస్ కూడా స్పిరిట్ విషయంలో సీరియస్ గా ఉన్నారని అన్నారు. దానితో స్పిరిట్ డేట్ మరకపోవచ్చని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మార్చ్ 5 నుంచి స్పిరిట్ ని పోస్ట్ పోన్ చేస్తూ.. వచ్చే ఏడాది దివాళి అంటే అక్టోబర్ 29 కి స్పిరిట్ ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చెయ్యకుండా ఫ్యాన్స్ ని ప్రభాస్ న్యూ లుక్ తో కూల్ చేస్తూ స్పిరిట్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు దర్శకుడు సందీప్ వంగ. 

Spirit new release date out