ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Deverakonda and Rashmika are currently busy promoting their Ranabaali

ఎక్కడ చూసినా రౌడీ జంటే

Vijay Deverakonda and Rashmika are currently busy promoting their RanabaaliVijay Deverakonda and Rashmika are currently busy promoting their Ranabaali

 

ప్రస్తుతం ఎక్కడ చూసినా రౌడీ జంటే అంటే రణబాలి జంటే కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న లు రణబాలి చిత్రాన్ని కాపాడుకోవడానికి రంగం లోకి దిగారు. గత శుక్రవారం విడుదలైన రణబాలి చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. దానితో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక లు సినిమా ని ఎలాగైనా బయట పడేయాలని చాలా కష్టపడుతున్నారు.

రణబాలి విడుదలైన రోజే సక్సెస్ మీట్ లో కనిపించారు విజయ్ దేవరకొండ-రష్మిక. నిన్న శనివారం గుంటూరు వెళ్లి ఆడియన్స్ ని కలవడం, విజయవాడ దసరా ఉత్సవాల్లో చిన్నారి అభిమానులతో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి సందడి చేసారు. రష్మిక మందన్న చక్కటి చీర కట్టులో ఆకట్టుకోగా.. విజయ్ దేవరకొండ ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు.

ఇక ఈరోజు హైదరాబాద్ లో జరగనున్న బతుకమ్మ ఉత్సవాల్లో రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ లు సందడి చెయ్యబోతున్నారు. మరి విజయ్ దేవరకొండ - రష్మిక ల కష్టం ప్రేక్షక దేవుళ్ళు గుర్తించాలని విజయ్ ఇంకా రష్మిక అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం ఈ కొత్త జంట ప్రమోషన్స్ రణబాలిని ఎంతవరకు బయటపడేస్తాయో అనేది. 
 

Vijay Deverakonda and Rashmika Mandanna