ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ranabaali: A huge box-office challenge for Vijay Deverakonda

రణబాలి ముందున్న సవాళ్లు

Ranabaali: A huge box-office challenge for Vijay DeverakondaRanabaali: A huge box-office challenge for Vijay Deverakonda


మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ రణబాలి చిత్రంపై ట్రేడ్ లో అంచనాలు ఎలా ఉన్నా ఆడియన్స్ లో ఆసక్తి తక్కువైంది. విజయ్ దేవరకొండ తో రష్మిక కలిసి నటిస్తుంది. అది తప్ప సినిమాపై ఎందుకో అంత నమ్మకాన్ని కలిగించడంతో రణబాలి టీమ్ ఫెయిల్ అయ్యింది. ప్రోపర్ ప్రమోషన్స్ కనిపించలేదు.

చేసిన ప్రమోషన్స్ కూడా సినిమాపై హైప్ పెంచాల్సింది పోయి వచ్చిన గెస్ట్ లంతా విజయ్ దేవరకొండ పై వస్తున్న ట్రోల్స్ పై మాట్లాడారు. మరోపక్క విజయ్ దేవరకొండ కు కెరీర్ లో వరసగా నిరాశ పరిచే సినిమాలు పడడం రణబాలి పై హోప్స్ తగ్గాయి. క్రేజీ హీరోయిన్ రష్మిక ఉంది. అయినప్పటికీ సినిమాపై బజ్ క్రియేట్ అవ్వడం లేదు.

ఇప్పుడు జైలర్ 2 బ్లాక్ బస్టర్ టాక్ రణబాలి ఓపెనింగ్స్ పై ఎంత ప్రభావం చూపిస్తుందో అనేది విజయ్ దేవరకొండ అభిమానుల్లో మొదలైన భయం. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిందే. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రణబాలి చిత్రానికి హిట్ టాక్ రావాల్సిందే. లో బజ్ తో హిట్ టాక్ తెచ్చుకుంటే విజయ్ దేవరకొండ సంచలనం సృష్టించినట్టే, చూద్దాం విజయ్ దేవరకొండ ఫేట్ ఎలా ఉండబోతుందో అనేది.!

Vijay Deverakonda needs a comeback