ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sai Pallavi Finally Set To Join Kalki 2 Shoot?

కల్కి 2 షూట్ లోకి ఎంటర్ అయిన సాయి పల్లవి?

Sai Pallavi Finally Set To Join Kalki 2 Shoot?Sai Pallavi Finally Set To Join Kalki 2 Shoot?

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సీక్వెల్ కల్కి 2 చిత్రం నుంచి సుమతి పాత్రధారి దీపికా పదుకొనె ను తప్పించడంతో ఆ కేరెక్టర్ లోకి ఎంటర్ కాబోయే కొత్త హీరోయిన్ పై చాలా ప్రిడిక్షన్స్ నడిచాయి. కల్కి 2 లో కీలకమైన సుమతి పాత్రలోకి ఏ హీరోయిన్ వస్తుందో అనే క్యూరియాసిటీ నడిచింది.

ఎక్కువగా సుమతి పాత్రను ఫిల్ చేసే కెపాసిటీ సాయి పల్లవి కే ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ దీపికా ప్లేస్ ను సాయి పల్లవి తో రీ ప్లేస్ చేయబోతున్నారని అన్నప్పటికి.. మధ్యలో నాగ్ అశ్విన్ మాత్రం కొత్త కేరెక్టర్స్ ఏవి కల్కి 2 లో జాయిన్ అవ్వడం అవ్వలేదు.. అనేసరికి సాయి పల్లవి కి ఛాన్స్ లేదేమో అనుకున్నారు.

తాజాగా సాయి పల్లవి కల్కి 2 సెట్ లోకి జాయిన్ అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్టోబర్ నుంచి కల్కి 2 షూటింగ్ మొదలువుతుంది అన్నారు నాగ్ అశ్విన్. దాని ప్రకారమే సాయి పల్లవి కల్కి 2 సెట్ లో జాయిన్ అయ్యింది అనే వార్త వైరల్ అవుతుంది మరి ఈ విషయం టీమ్ అధికారికంగా ప్రకటించేవరకు సస్పెన్స్ అనే చెప్పాలి. 

New Shoot Update of Kalki 2898 AD Sequel