భర్త-కొడుకులతో నయనతార హాలిడే ట్రిప్
Nayanthara and his family enjoying vacation
క్రేజీ హీరోయిన్ నయనతార తన భర్త విగ్నేష్ శివన్ అలాగే కొడుకులు ఉయిర్-ఉలగమ్ లతో కలిసి హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది. కొడుకులతో కలిసి ఆడుకుంటుంది. భర్త విగ్నేష్ శివన్ తో కలిసి రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులిస్తుంది. నయనతార షూటింగ్ నుంచి ఎలాంటి చిన్న బ్రేక్ దొరికినా భర్త విగ్నేష్ శివన్ తో కలిసి విదేశాలకు వెళ్ళిపోతుంది.
ఇప్పుడు కొడుకులు కూడా యాడ్ అవడంతో ఫ్యామిలీ ట్రిప్ గా నయనతార తన సమయాన్ని కేటాయిస్తుంది. తాజాగా నయనతార ఫ్యామిలీ ఏ దేశంలో ఉంది అనేది తెలియదు కానీ.. భర్త, పిల్లలతో కలిసి సమయాన్ని గడుపుతూ చాలా ఆనందంగా టైమ్ స్పెండ్ చేస్తుంది.
ఇకపోతే ఈ ఏడాది నయనతార కు బ్యాక్ టు బ్యాక్ షాక్ లు తగిలాయి. ఎన్నో హోప్స్ పెట్టుకున్న టాక్సిక్ పాన్ ఇండియా షాక్ ఇవ్వగా.. ఆతర్వాత హాయ్ చిత్రము ఆమెను డిజప్పాయింట్ చేసింది. ఇక విగ్నేష్ శివన్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారు.
















































