BB10 లోకి వెళ్లబోయే ఆరుగురు వైల్డ్ కార్డ్స్ ఎవరంటే
Bigg Boss Telugu 10 may see wild card entries in Week 5
బిగ్ బాస్ సీజన్ 10 లోకి 16 మంది కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా అడుగుపెట్టారు. అందులో కామనర్స్, సెలెబ్రిటిస్ ఉన్నారు. మూడో వారం లో ఇద్దరు అగ్నిపరీక్ష 2 నుంచి అపూర్వ, మిథిలేష్ లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అందులో మిథిలేష్ 15 లక్షల సూట్ కేస్ తో రెండో రోజే సెల్ఫ్ ఎలిమినెట్ చేసుకున్నాడు.
ఇక ఈ సీజన్ ఐదో వారం గడిచేసరికి ఏకంగా ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వారం చాలామంది కొత్తవాళ్లు హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది అని బిగ్ బాస్ హింట్ కూడా ఇచ్చాడు. అయితే ఈవారం వైల్డ్ కార్డు ద్వారా సీజన్ 10 లోకి అడుగెట్టబోయేది ఎవరంటే.. శ్వేతా నాయుడు, అలాగే నటరాజ్ మాస్టర్ వైఫ్ నీతూ, RGV హీరోయిన్ దక్షీ గుత్తికొండ, సీరియల్ యాక్టర్ శివ, అగ్నిపరీక్ష రామకృష్ణ లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఆరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మరి ఐదో వారంలో ఆరుగురు హౌస్ లోకి వస్తే.. ఈ వారం ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
















































