ప్రభాస్ బర్త్ డే సర్ ప్రైజ్ అదేనా?

Prabhas' Birthday Surprises LoadingPrabhas' Birthday Surprises Loading


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కి పండగ రోజు. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే. ప్రభాస్ ఫ్యాన్స్ కేక్ కటింగ్స్, బ్యానర్ లు కట్టడమే కాదు, ఆయన కొత్త సినిమాల సర్ ప్రైజ్ ట్రీట్స్ తో సోషల్ మీడియాని అల్లాడిస్తారు. మరి ప్రభాస్ బర్త్ డే కి ఆయన నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ ఫౌజీ, స్పిరిట్ నుంచి ఎలాంటి ట్రీట్స్ వస్తాయో అనే క్యూరియాసిటీతో తెగ ఎదురు చూస్తున్నారు.

డిసెంబర్ 3 నుంచి పోస్ట్ పోన్ అయిన ఫౌజీ చిత్రానికి సంబందించిన గ్లింప్స్ ని వదిలేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానితో పాటుగా రిలీజ్ డేట్ లాక్ చేసి రివీల్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఫౌజీ గ్లింప్స్ పై దర్శకుడు, టీమ్ నిమగ్నమై ఉన్నారని టాక్.

మరోపక్క సందీప్ వంగ స్పిరిట్ నుంచి ప్రభాస్ బర్త్ డే రోజున అద్భుతమైన ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అదేమిటో అనేది క్లారిటీ లేదు కానీ, స్పిరిట్ నుంచి రాబోయే ట్రీట్ మాత్రం ఫ్యాన్స్ ని తెగ ఇంప్రెస్ చేస్తుంది అని సమాచారం. మరి ఈసారి ప్రభాస్ బర్త్ డే ని ఫ్యాన్స్ ని మాములుగా సెలెబ్రేట్ చేసుకోరన్నమాట.

Prabhas' Birthday Surprises