దర్శకుడిగా ఫెయిల్-నటుడిగా ఎంట్రీ!

Jason Sanjay hero debutJason Sanjay hero debut


కోలీవుడ్ స్టార్ హీరో కమ్ తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతాడు అనుకుంటే.. ఆయన ముందుగా డైరెక్టర్ గా మారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జాసన్ సంజయ్ డెబ్యూ మూవీ సిగ్మా రీసెంట్ గా విడుదలై ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసింది.

దర్శకుడిగా ఫెయిల్ అయిన జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్త కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. విజయ్ కి వారసుడిగా జాసన్ సంజయ్ ను హీరోగా చూడాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ జాసన్ సంజయ్ దర్శకత్వాన్ని ఎంచుకోవడంతో వారు సైలెంట్ అయ్యారు.

అయితే విజయ్ అభిమానుల కోరిక మేరకు జాసన్ హీరో గా మారబోతున్నారని తెలుస్తుంది. జాసన్ సంజయ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తుంది అని టాక్. జాసన్ సంజయ్ డెబ్యూ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శకులు కథలను సిద్ధం చేసి వినిపించినట్లు తెలుస్తోంది.

అలా జాసన్ కోసం కథలు సిద్ధం చేసిన వారిలో మాస్, యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు లింగుసామి కూడా ఉన్నారని టాక్. కోలీవుడ్ లో విజయ్ కున్న పేరు, ప్రతిష్టలు దృశ్య సంజయ్ మొదటి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

Junior Vijay's Directorial Debut Failed, What About Acting? -