గాంధీ జయంతి వేళ `మున్నాభాయ్` జ్ఞాపకాలు
Sanjay Dutt remembered Mahatma Gandhi on Gandhi Jayantiగాంధీ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జాతిపిత మహాత్మా గాంధీకి ప్రత్యేకంగా నివాళులర్పించారు. భారతీయ సినిమాలో గాంధీజీ సిద్ధాంతాలను, అహింసా మార్గాన్ని ఆధునిక శైలిలో `గాంధీగిరి` పేరుతో జనాల్లోకి తీసుకెళ్లిన గొప్ప చిత్రం `మున్నాభాయ్ M.B.B.S`. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సంజయ్ దత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా `మున్నాభాయ్` చిత్రంలోని ఐకానిక్ కామెడీ సన్నివేశాన్ని అభిమానులతో పంచుకున్నారు.
సమాజంలో శాంతి, అహింస, సత్యం ప్రాముఖ్యతను సరదా వ్యాఖ్యలు ..నవ్వులతో నేర్పించిన `మున్నాభాయ్` కామెడీ క్లిప్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. మున్నా భాయ్ (సంజయ్ దత్) సర్క్యూట్ (అర్షద్ వర్సీ)ల మధ్య సాగే కామెడీ సన్నివేశం గాంధీజీ సందేశాలను తేలికగా, హృదయానికి హత్తుకునేలా చెప్పవచ్చో గుర్తుచేస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చలనచిత్ర రంగంలో గాంధీజీ ఆలోచనలను, ఆదర్శాలను నేటి తరం యువతకు సులభంగా అర్థమయ్యేలా అందించడంలో మున్నాభాయ్ సిరీస్ చిత్రాలు మైలురాయిగా నిలిచాయి. సంజయ్ దత్ షేర్ చేసిన ఈ వీడియోపై అభిమానులు , నెటిజన్లు స్పందించారు. బాపు ఆదర్శాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని.. `గాంధీగిరి` కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుందని పోస్టులు పెడుతున్నారు.















































