బిగ్ బాస్ 10: కెప్టెన్సీ vs ఇమ్యూనిటీ

Bigg Boss 10: Captaincy vs ImmunityBigg Boss 10: Captaincy vs Immunity

 

బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ వారం కంటెస్టెంట్స్ మద్యన నామినేషన్స్ వార్, కెప్టెన్సీ వార్ రెండూ రచ్చ రచ్చ గా సాగాయి. హౌస్ మేట్స్ నడుమ యుద్దాలు జరిగాయి. ఒకరికొకరు అరుచుకోవడం, కొట్టుకునే వరకు వెళ్లడంతోనే వారం గడిచిపోయింది. బ్లూ టీమ్ రెడ్ టీం అంటూ టాస్క్ లు అడగా చాలా టాస్క్ ల్లో రెడ్ టీమ్ క్లీన్ స్వీప్ చేసింది.

అయితే రెడ్ అండ్ బ్లూ టీమ్ లో ఎవరు కెప్టెన్సీ టాస్క్ ఆడాలి, ఎవరికీ ఇమ్యూనిటీ కావాలి అనే విషయంలో ముఖేష్ గౌడ్ సృష్టి దగ్గర ఉన్న డాగర్స్ లో ఒకటి ఇమ్మని అడగగా.. నేను దేబ్జానీ కి ఇస్తా అంది, కానీ దేబ్జానీ దగ్గర ఉంది అంటే, మరొకరికి ఇస్తా కానీ నీకివ్వను అనేసింది. ఆ తర్వాత అమన్ కూడా తనకు ఇమ్యూనిటీ కావాలని అడిగాడు.

ఇమ్యూనిటీ ఇస్తే కెప్టెన్సీ టాస్క్ ఆడే అవకాశం లేదు అంటే నాకు రెండూ కావాలని అపూర్వ తో గొడవపడ్డాడు అమన్, దానితో రోహిత్ అమన్ కు ఇమ్యూనిటీ కావాలి, టాస్క్ ఆడి కెప్టెన్సీ గెలవాలని అనుకుంటున్నాడంటూ వేరే చోట మాట్లాడుతున్నాడు. ఇక ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్ లో అమన్ గెలిచాడు, కానీ వర్షిణి ఇచ్చే ట్విస్ట్ తో అమన్ కెప్టెన్సీ ఏమవుతుందో అనేది చూడాలి. 

 

Bigg Boss Telugu 10