సిగ్మా పబ్లిక్ టాక్
Sigma Public Talk
తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విజయ్ డెబ్యూ మూవీగా సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన సిగ్మా చిత్రం ఈరోజు అంటే అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోగా కెరీర్ లో వెనకబడిన సందీప్ కిషన్ ని హీరోగా పెట్టి జాసన్ విజయ్ మొదటిసారి దర్శకుడిగా పరిచయమయ్యారు.
సిగ్మా విడుదలకు ముందు తెలుగులో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు, కనిపించలేదు. సందీప్ కిషన్ మర్కెట్ తెలుగులో బాగా డల్ అయ్యింది. సందీప్ తో పాటుగా జాసన్ విజయ్ కూడా తెలుగులో సిగ్మా ని బాగా ప్రమోట్ చేయలేకపోయారు. సందీప్ కిషన్ అయినా దీనిపై దృష్టి పెట్టవలసింది. ఈ వారం ఏకంగా పది సినిమాల మధ్యలో తొమ్మిదో సినిమాగా సిగ్మా విడుదలైంది. అయితే సిగ్మా ఓపెనింగ్స్ పై మలయాళ హీరో ఫాహద్ ఫాసిల్ డోంట్ రంబుల్ ద ట్రబుల్ మూవీ ఎఫెక్ట్ దీని పై కనిపించింది.
తెలుగులో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ డామినేషన్ సిగ్మా కి నెగెటివ్ అయ్యింది. ఇక ఈ రోజు విడుదలైన సిగ్మా చిత్రానికి నెగెటివ్ టాక్, పూర్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా ఫస్టాఫ్ డల్‌గా సాగింది.. సెకండాఫ్ యాక్షన్ పర్వాలేదు అంటూ.. జాసన్ విజయ్ డెబ్యూ డైరెక్టర్ అని అర్థమైపోతుంది. డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే వీక్, అసలు సినిమాలో చెప్పుకునేందుకు ఎలాంటి పాజిటివ్ పాయింట్స్ కనిపించలేదు అంటూ సోషల్ వస్తున్నా కామెంట్స్ చూసి అవుట్ ఫుట్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
సిగ్మా పూర్తి రివ్యూ మరికాసేపట్లో..















































