ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Don't Trouble the Trouble – Public Talk

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పబ్లిక్ టాక్

Don't Trouble the Trouble – Public TalkDon't Trouble the Trouble – Public Talk


మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ హీరోగా ఎస్ ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ నిర్మించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ నిన్న అక్టోబర్ 1 నైట్ ప్రీమియర్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ లాంగ్వేజెస్ లో విడుదలైన ఈచిత్రానికి  రాజమౌళి ఫ్యామిలీ ఉండడం, బాలయ్య వాయిస్ ఓవర్, ఎన్టీఆర్, మహేష్ బాబు లు సినిమాని ప్రమోట్ చెయ్యడంతో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

మరి ప్రీమియర్స్ పూర్తయిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పబ్లిక్ టాక్ లోకి వెళితే.. సూరి కేరెక్టర్ లో ఫహద్ ఫాసిల్ చిల్లర దొంగగా మంచి నటన కనబరిచారు, కాకపోతే ఫహద్ తెలుగు డబ్బింగ్ అక్కడక్కడా కాస్త ఇబ్బంది పెడుతుంది. పాప సారా పాలేకర్ నటన పరంగా ఆకట్టుకుంది, సారా స్క్రీన్ పెజెన్స్ కూడా బావుంది.

కాల భైరవ మ్యూజిక్ ఆకట్టుకుంది కానీ BGM తేలిపోయింది, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్. క్లైమాక్స్ సన్నివేశాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. దర్శకుడు కథను ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయ్యేలా రాసుకోపోవడం, ఫస్ట్ హాఫ్ మైనస్ లుగా మిగిలిపోతాయి. 

Don't Trouble the Trouble Social Media