ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> No doubt: Fauzi comes only after Spirit

నో డౌట్: స్పిరిట్ తర్వాతే ఫౌజీ

No doubt: Fauzi comes only after SpiritNo doubt: Fauzi comes only after Spirit


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిమ్స్ రిలీజ్ డేట్స్ విషయంలో అభిమానుల్లో గందరగోళం నడుస్తుంది. ఫౌజీ డిసెంబర్ 3 నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది నిర్మాతలకే క్లారిటీ లేదు దానితో వారు ఎక్కడా ఫౌజీ విడుదల తేదీపై నోరు మెదపడం లేదు.

మరోపక్క ఫౌజీ 2027 సంక్రాంతికి కాదు 2027 సమ్మర్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక మరో పాన్ ఇండియా మూవీ స్పిరిట్ షూటింగ్ అనుకున్న సమయానికే సాగుతుందట. అంటే మార్చి లో స్పిరిట్ విడుదల పక్కా అంటున్నారు. అయితే ఫౌజీ విడుదల తేదీ ఫైనల్ చేయకపోవడానికి కారణం ఏమిటంటే...

ఫౌజీ షూటింగ్ పూర్తి కాలేదట. ఇంకా 60 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అందులో ప్రభాస్ డేట్స్ ఎక్కువ ఉన్నాని సమాచారం. సో షూటింగ్ పూర్తయ్యాకే విడుదల తేదీపై ఫౌజీ మేకర్స్ క్లారిటీ ఇస్తారట. ఈ లెక్కన సందీప్ వంగ అనుకున్న సమయానికి స్పిరిట్ కంప్లీట్ చేసి మార్చి లో వచ్చేస్తే..

ఆతర్వాత ఫౌజీ వస్తుందేమో. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంలో మాత్రం చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. రాజాసాబ్ డిజాస్టర్ ను ఫౌజీ మరిపిస్తుంది అనుకుంటే అది ఇంకా ఇంకా లేట్ అవడమే వారికి నచ్చడం లేదు. 

Fauzi vs Spirit