రవితేజ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Interecting title for Ravi Teja nextInterecting title for Ravi Teja next

 

ఇరుముడి తో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన మాస్ మహారాజ్ రవితేజ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఇరుముడి రిలీజ్ కి ముందే రవితేజ దర్శకుడు వివేక్ ఆత్రేయ కి కనెక్ట్ అయ్యారు. ఇరుముడి తదుపరి చిత్రం వివేక్ ఆత్రేయతోనే ఉండబోతుంది. అయితే ఈమధ్యన రవితేజ ఇరుముడి సక్సెస్ తో పారితోషికం పెంచేశారనే న్యూస్ నడుస్తుంది.

వివేక్ ఆత్రేయ సినిమాకి కూడా రవితేజ పారితోషికం పెరుగుతుందా, ముందే అడ్వాన్స్ ఇవ్వడంతో పాత పారితోషికమే కంటిన్యూ అవుతుందో అనేది ప్రస్తుతం క్లారిటీ లేకపోయినా.. వివేక్ ఆత్రేయ-రవితేజ కలయికలో తెరకెక్కబోయే చిత్రానికి ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. వివేక్ ఆత్రేయ టైటిల్స్ ఎంత ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో మనకు తెలుసు.

ఇప్పుడు రవితేజ సినిమా కి కూడా అలాంటి వెరైటీ టైటిల్ ని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రవితేజ కోసం వివేక్ ఆత్రేయ 'తులాభారం' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు అని సమాచారం. సో ఇరుముడి, తర్వాత మాస్ మహారాజ్ తులాభారం అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వస్తారన్నమాట.

Ravi Teja And Vivek Athreya Film Gets Catchy Title