విజయ్ వర్మపై దంగల్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Fatima Sana Shaikh Calls Vijay Varma Emotionally Intelligent`దంగల్` ఫేం ఫాతిమా సనా షేక్ తన సహనటుడు, ఆప్తుడైన విజయ్ వర్మపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జియో హాట్‌స్టార్‌లో విడుదలైన కోర్టురూమ్ డ్రామా `హుంకార్: ది రోర్` ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ విజయ్ వర్మ అద్భుతమైన నటుడని .. ఆయనలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందని కొని యాడారు. విజయ్ కేవలం ప్రతిభావంతుడైన నటుడే కాదు ఎంతో తెలివైన వ్యక్తని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు.
విజయ్ వర్మతో పాటు నటి రియా చక్రవర్తికి కూడా తాను ఎంతో దగ్గరగా ఉంటానని.. తామంతా తరచూ మాట్లాడుకుంటూ ఆలోచనలను పంచుకుంటామని ఫాతిమా చెప్పారు. గతంలో `గుస్తాఖ్ ఇష్క్` సినిమాలో కలిసి నటించిన సమయంలో ఫాతిమా, విజయ్‌ల మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇద్దరి ఆలోచనా శైలి, హాస్య చతురత ఒకేలా ఉండటంతో సెట్స్‌లో నవ్వుకునే జోకులు ఇతరులకు అర్థమయ్యేవి కావు.
ఈ స్నేహం వల్ల నటన సులభమైనప్పటికీ కొన్నిసార్లు షూటింగ్‌కు ఇబ్బందిగా మారేదని విజయ్ కూడా గతంలో తెలి పారు. సినిమాలో పాత్రల మధ్య కొంత దూరం, గంభీరత ఉండాల్సి రాగా ఇద్దరు సెట్స్‌లో నిరంతరం సరదాగా ఉండటంతో దర్శకుడు విభు పురి జోక్యం చేసుకుని కాస్త తగ్గమని చెప్పాల్సి వచ్చిందని వెల్లడించారు. కాగా తమ మధ్య ఉన్న ఈ స్నేహబంధం చాలా అందమైనదని తామంతా ఎంతో ఆత్మీయ మిత్రులమని ఫాతిమా వివరించారు.
















































