ప్రీమియర్స్ విషయంలో నిర్మాత వెనకడుగు
No Paid Premieres for Venkatesh's Film
కొన్నాళ్లుగా సినిమాల విడుదలకు ముందే ప్రీమియర్స్ అంటూ మేకర్స్ తెగ హడావిడి చేస్తున్నారు. సినిమాలపై ఉన్న నమ్మకంతో చిన్న, పెద్ద నిర్మాతలు ప్రీమియర్స్ తో క్యాష్ చేసుకోవడానికి బయలుదేరుతున్నారు. కానీ ఇప్పుడొక నిర్మాత మాత్రం తన సినిమాకి ప్రీమియర్ వెయ్యమంటున్నారు.
ఆయనే సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగవంశీ.. ఆయన నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం చిత్రం ఈ నెల 9 న విడుదల కాబోతుంది. రెగ్యులర్ షోస్ తోనే సినిమా రిలీజ్ అవుతుంది, ఎలాంటి ప్రీమియర్స్ లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా అనుకున్న తేదీకే విడుదల అంటూ ప్రకటించారు.
మరి ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమాని ప్రీమియర్స్ లేకుండా నిర్మాత డైరెక్ట్ గా రిలీజ్ చేస్తా అంటున్నారు. అది ఒకందుకు మంచిదే. ప్రీమియర్స్ తో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయితే ఓపెనింగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే నాగవంశీ మంచి డెసిషన్ తీసుకున్నారు అంటున్నారు.
















































