ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shahrukh Khan's Nickname In School Was Mail Gaadi

షారూఖ్‌కు మేల్ గాడీ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Shahrukh Khan's Nickname In School Was Mail GaadiShahrukh Khan's Nickname In School Was Mail Gaadi

న్యూఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో తన బాల్యం, పాఠశాల రోజులను బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ పలు సందర్భాల్లో ఎంతో  గుర్తు చేసుకున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ఎంతో చురుగ్గా ఉండే షారూఖ్‌‌కు పాఠశాలలో మేల్ గాడీ (ఎక్స్‌ప్రెస్ రైలు) అని ముద్దుపేరు ఉండేది. ఆయన ఎక్స్‌ప్రెస్ రైలులా ఎంతో వేగంగా పరిగెత్తడం, పరిగెత్తే సమయంలో ఆయన జుట్టు ముందుకొచ్చి గాలిలో ఎగరడంతో స్నేహితులంతా షారుక్ ని సరదాగా అలా పిలిచేవారు.

సూపర్‌స్టార్‌గా ఎదిగిన తర్వాత ఒకసారి  పాత పాఠశాలను సందర్శించిన సమయంలో షారూఖ్  స్కూల్ రోజుల నాటి అల్లరి పనులను నెమరు వేసుకున్నారు. ఆ సమయంలో స్కూల్ ప్రతినిధి ఒకరు షారూఖ్‌తో సరదాగా మాట్లాడుతూ.. `వేరే పాఠశాల (మోడర్న్ స్కూల్) విద్యార్థులతో గొడవపడి వారి పళ్ళు ఊడగొట్టిన సంఘటన గుర్తుందా?` అని అడగగా షారూఖ్ నవ్వులు పూయించారు. అలాగే క్లాస్‌రూమ్‌లో ఫిట్స్ వచ్చినట్లు నటిస్తూ ఉపాధ్యాయులను పరేషాన్ చేయడం, కెమిస్ట్రీ టీచర్‌ను నమ్మించి మంచి మార్కులు పొందేలా చేయడం వంటి అనేక సరదా ఘటనలను  పంచుకున్నారు.

సెయింట్ కొలంబస్ పాఠశాల అందించిన క్రమశిక్షణ, అక్కడ లభించిన ప్రోత్సాహమే తన వ్యక్తిత్వ వికాసానికి, నటనపై ఆసక్తికి పునాది వేశాయని షారూఖ్ పేర్కొన్నారు. స్కూల్ రోజుల్లోనే నాటకాలు, క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా స్వర్డ్ ఆఫ్ హానర్ అవార్డును కూడా షారుక్ సొంతం చేసుకున్నారు. ముంబై వెళ్ళి  గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా? ఢిల్లీలోని తన మూలాలను, పాఠశాల జ్ఞాపకాలను షారూఖ్ ఖాన్ ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతుంటారు.

Shah Rukh had revealed his nickname in school was mail gaadi