ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> CM Chandrababu and Pawan Kalyan participated in Palle Panduga 3 point 0

ఎన్ని గొడవలున్నా.. ఇలా కలిసి నడిస్తే..

CM Chandrababu and Pawan Kalyan participated in Palle Panduga 3 point 0CM Chandrababu and Pawan Kalyan participated in Palle Panduga 3 point 0

 

కూటమి ప్రభుత్వంలో కీలకమైన టిడిపి, జనసేన దోస్తీ విషయంలో లోపల ఏం జరిగినా అది బయట ప్రపంచానికి కనిపించకుండా చేసినా బ్లూ మీడియా దానిని పదే పదే తవ్వుతూ ప్రచారం చేస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని విడగొట్టేవరకు బ్లూ మీడియా, వైసీపీ పార్టీ నిద్రపోదు. కానీ కలిసి ఉంటేనే కలదు బలం అన్నట్టుగా టీడీపీ , జనసేన ఒక్కటిగా కనిపిస్తేనే ప్రజలకు నమ్మకం, కూటమికి బలం.

పవన్ కళ్యాణ్ కేరళం ఆయుర్వేద వైద్యానికి వాళ్లొచ్చేసరికి ఇక్కడ ఏవేవో జరిగిపోయాయి. దానితో జనసేన ను తొక్కేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుంది అని, పవన్ కళ్యాణ్ జనసేనను ఎదగనియ్యరంటూ బ్లూ మీడియా వార్తలు ముద్రించడమే కాదు.. కొన్ని పరిణామాలు  కూటమి చెలిమిని దెబ్బతీసేలా జరిగాయి.

ఎంత జరిగినా, ఎలా ఉన్నా రెండు రోజుల క్రితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పల్లెల్లో నవోదయానికి నాంది పలుకుతూ ప్రతిష్ఠాత్మకంగా పల్లె పండుగ-3 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో కలిసి నడుస్తూ కార్యకర్తలను, ప్రజలను ఆప్యాయంగా పలకరించిన తీరు చూసి జనసేన, టీడీపీ కార్యకర్తలే కాదు, ఏపీ ప్రజలు సైతం ఫిదా అయ్యారు.

పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిందని ఆ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంసించడం దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ తో కలిసి సూపర్ సిక్స్ హామీలను నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ.4,000 పెన్షన్ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నామన్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులతో వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో బయటకు తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈకార్యక్రమం ఎంతగా విజయవంతమైందో అనేది సోషల్ మీడియాలో బాబు-పవన్ కలయికపై వస్తున్న పోస్ట్ లు చూస్తే తెలుస్తుంది.

మరి కూటమిలో ఎన్ని గొడవలున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఇలా కలిసి నడిచినా, కనిపించినా ప్రజల్లో వీరి పట్ల నమ్మకం పెరుగుతుంది. 

CM Chandrababu Appreciate To Pawan Kalyan