KBC సెట్ లో అమితాబ్ కి గాయం

Amitabh Bachchan gets injured Amitabh Bachchan gets injured


బిగ్ బి అమితాబచ్చన్ 80 ప్లస్ ఏజ్ లోను హుషారుగా సినిమా షూటింగ్స్ మాత్రమే కాదు ఎంతోప్రతిష్టాత్మగా 18 సీజన్స్ గా సక్సెస్ గా తెరకెక్కుతున్న కౌన్ బనేగా కరోడ్పతి షో కి హోస్ట్ గా చేస్తున్నారు. అమితాబచ్చన్ ఎంతో ఎనేర్జిగా ఈ షో లో కనిపిస్తారు. గ్యాలరీలో ఆడియన్స్ ని పలకరించడం, కంటెస్టెంట్స్ కి వెల్ కమ్ చెప్పడం, వారితో మాట్లాడడం అన్ని షో కి హైలెట్.

అయితే అమితాబ్ కి రీసెంట్ గా కౌన్ బనేగా కరోడ్పతి సెట్ లో గాయమైంది. తాను కౌన్ బనేగా కరోడ్పతి సెట్ లో షూటింగ్ సమయంలో గాయాపడినట్లుగా అమితాబ్ స్వయంగా ప్రకటించారు. స్టేజ్ మధ్యలో నిలబడి స్వాగతం చెప్పే ఆయన ఈసారి అలా చెయ్యలేదు. కారణం తన మోకాలికి గాయం కావడంతో నిలబడటంలో ఇబ్బంది పడుతున్నట్టుగా ఆయన చెప్పారు.

కాకపోతే ఆ గాయం వలన పెద్ద ప్రమాదం లేదు అని, ఫ్యాన్స్ ఎవరూ తనకు జరిగిన ప్రమాదం విషయంలో ఆందోళన చెందవద్దు అని ఆయన అభిమానులకు సర్ది చెప్పారు. అయినా అమితాబ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడికి ప్రత్యేకపూజలు చేస్తూ ప్రార్థిస్తున్నారు.

Amitabh Bachchan gets injured after he slips and falls on KBC 18 set