AK 47 రిలీజ్ పై నిర్మాత కాన్ఫిడెన్స్
Naga Vamsi Latest Tweet Put Rumours Around AK47 To Rest
వెంకీ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆదర్శకుటుంబం ఈ నెల 2 అంటే రేపు శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా.. జస్ట్ ఒక్క వారం పోస్ట్ పోన్ చేస్తూ వచ్చే వారం అంటే అక్టోబర్ 9 న సినిమాని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించడమే తరువాయి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. సాంగ్స్ వదలడం, ఇంటర్వూస్ అంటూ హడావిడి స్టార్ట్ చేసారు.
ఇంత చేస్తున్నా ఆదర్శకుటుంబం విడుదల వాయిదా అంటూ పేరు పెట్టకుండా ఓ పెద్ద సినిమా అనుకున్న డేట్ కి రావడం లేదుగా అంటూ కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. దానితో నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా.. ఆదర్శ కుటుంబం అనుకున్న సమయానికే వస్తుంది, ఎలాంటి డౌట్ లేదు.
మా రిలీజ్ పంక్చువాలిటీ మీద మీకు డౌట్ ఉండొచ్చు, కానీ ఈసారి ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు. ఆదర్శకుటుంబం, AK 47 అక్టోబర్ 9 రిలీజ్. 6 ట్రైలర్ లాంచ్, 7 అడ్వాన్స్ బుకింగ్స్.. Families andaru mee pillalatho exams baaga rayinchi, holidays ki baga suit ayye ma chakkani comedy action family film tho start cheyandi… happy ga navvukuntu enjoy cheyyadaniki please come to the theatres ❤️ 9th October ki direct ga theatres lo kaluddam, no premieres💥🤗 అంటూ నాగవంశీ ఆదర్శకుటుంబం రిలీజ్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు.
















































