ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rithu Chowdary About Demon Pavan Social Media Post

మాది ప్రేమే కాదంటున్న రీతూ చౌదరి

Rithu Chowdary About Demon Pavan Social Media PostRithu Chowdary About Demon Pavan Social Media Post

 

బిగ్ బాస్ సీజన్ 9 లో హాగ్ లు ముద్దులతో రెచ్చిపోయి ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ ఇచ్చిన డిమోన్ పవన్, రీతూ చౌదరి హౌస్ లో కాకుండా బయటికొచ్చాక కూడా అలానే బిహేవ్ చేసారు. ఫ్రెండ్స్ కాదు లవర్స్ అనే రీతిలో రీతూ-పవన్ లు కనిపించారు. కలిసి ప్రాజెక్ట్స్ చేసారు. ఒకరికొకరు అనేలా కనిపించడంతో వీరు ఫ్రెండ్స్ కాదు లవర్స్ అన్నారు జనాలు.

ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. డిమోన్ పవన్ ఆ విషయాన్ని కన్ ఫర్మ్ చేసాడు. తాను రీతూ విడిపోయామని, మేమిద్దరం సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నాం, రీతూ తో గొడవలు చాలానే జరిగాయి. నేను ఎంత సర్దుకుపోయినా ఆ గొడవ తగ్గలేదు, అందుకే రివాన్ జంట ఇకపై కనిపించదు, వినిపించదంటూ పోస్ట్ పెట్టేసాడు.

దానితో డిమోన్ పవన్, రీతూ కి బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వెలిసాయి. ఆ పోస్ట్ లు చూసి రీతూ చౌదరి రియాక్ట్ అవుతూ మాది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే, మేమేదో ప్రేమలో ఉన్నట్టుగా ఈ బ్రేకప్ న్యూస్ లు ఏమిట్రా బాబు అంటూ నెత్తినోరు కొట్టుకుంటుంది. ఫ్రెండ్స్‌ మధ్య గొడవలు రావడం సహజమేనని, వాడేదో పోస్ట్ పెడితే దానిటీపై వార్తలు అల్లడం, రివ్యూ లు ఇవ్వడమేమిటో అంటూ రీతూ చౌదరి వాపోయింది.

అసలు మా మద్యన ఏం జరిగిందో తెలియకుండానే ఈ రకమైన వార్తలు పుట్టిస్తున్నారు, వాడు ఏదో పెట్టాడు.. మీరు ఇంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా.. అంటూ రీతూ చౌదరి తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

Rithu Chowdary Opens Up About Demon Pavan Post