BB10: లవ్ స్టోరీస్ లో గొడవలు
Audience Shocking Reactions On Bigg Boss Season 10 Telugu Over Love Tracks
బిగ్ బాస్ సీజన్ 10 లో ముఖేష్ గౌడ్, వర్షిణి ల నడుమ లవ్ ట్రాక్ మొదలైంది. అగ్నిపరీక్షలో రోహిత్-షాలిని ల నడుమ అండర్ స్టాండింగ్ మొదలై అది హౌస్ లోకొచ్చాక కూడా కంటిన్యూ అవుతుంది. అయితే రోహిత్ - షాలిని లు ఓవర్ చెయ్యడం లేదు. కానీ ముఖేష్ - వర్షిణి లు చాలా ఓవర్ చేస్తున్నారు.
నిన్న రాత్రి ఎపిసోడ్ లో ముఖేష్ గౌడ్ రోహిత్ ని షాలిని ని, అపూర్వని ఉద్దేశించి చిన్నది, పెద్దది అంటూ కామెంట్ చేయడంతో అపూర్వ ఫైర్ అయ్యింది. నిన్నెప్పుడైనా మేము కామెంట్ చేశామా, వర్షిణి గురించి నీ గురించి మాట్లాడమా అంటూ రెచ్చిపోయి ముఖేష్ గౌడ్ ని ఏసుకుంది. రోహిత్ కూడా మీరు ఎలా ఉంటున్నారో మేము ఏమైనా మాట్లాడమా అంటూ ముఖేష్ పై గొడవకు దిగాడు.
ముఖేష్ గౌడ్, వర్షిణిప్రేమ కథ హౌస్ లో తెలిసినా ఎవరూ అంతగా సీరియస్ గా తీసుకోలేదు కానీ, గత రాత్రి ఎపిసోడ్ లో మాత్రం బిగ్ బాస్ లవ్ స్టోరీస్ నడుమ జరిగిన వాగ్వాదం మాత్రం తెగ హైలెట్ అయ్యింది. కానీ ఆడియన్స్ మాత్రం ఈ లవ్ స్టోరీస్ ని చూసి షాకవుతున్నారు.
















































