ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> To what extent will the Nandamuri heroes be of help?

నందమూరి హీరోలు ఎంతవరకు హెల్ప్ అవుతారో?

To what extent will the Nandamuri heroes be of help?To what extent will the Nandamuri heroes be of help?

 

మలయాళ స్టార్ ఫాహద్ ఫాసిల్ కి టాలీవుడ్ హీరోలు అందులోను నందమూరి హీరోలు చాలానే హెల్ప్ చేసారు. ఫాహద్ ఫాసిల్ నటించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రానికి నందమూరి నటసింహ బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ చిత్ర టైటిల్ బాలయ్య సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్. ఇక ట్రైలర్ లో బాలయ్య వాయిస్ చాలా హైలెట్ అయ్యింది.

ఇక ఇదే చిత్రానికి మరో నందమూరి యువ హీరో కూడా తనకు చేతనైనంత చేసారు. ఈ చిత్రాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ, శోభు యార్లగడ్డ నిర్మించడంతో కార్తికేయ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఎన్టీఆర్ ఎనేర్జి స్పీచ్, అభిమానులు ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసిన తీరు, అన్ని ఈ సినిమాపై ఎంతోకొంత ఆసక్తి ని పెంచుతున్నాయి.  

ఫాహద్ ఫాసిల్ చిత్రానికి నందమూరి హీరోలైన బాలయ్య, ఎన్టీఆర్ ప్రమోట్ చెయ్యడంతో ఈ చిత్రంపై జనాల్లో ఆసక్తి  పెరిగింది. మరి నందమూరి హీరోలు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్ర ఓపెనింగ్స్ కి ఎంత హెల్ప్ అవుతారు, ఈ హీరోల క్రేజ్ ఈ చిత్ర కలెక్షన్స్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో అనేది అక్టోబర్ 2 వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. 

NTR at Don't Trouble The trouble pre release event