ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anirudh Ravichander has opened up about creating the BGM

BGM గుట్టు విప్పిన అనిరుధ్!

Anirudh Ravichander has opened up about creating the BGMAnirudh Ravichander has opened up about creating the BGM

సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన `జైలర్` చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ 'మాథ్యూ' అనే ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ పాత్ర ప్రవేశించే సన్నివేశాల్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  థియేటర్లలో విశేషంగా ఆకట్టుకుంది. మోహన్‌లాల్ పాత్రకు అంతటి ప్రత్యేకమైన  స్టైలిష్ సంగీతాన్ని ఎందుకు స్వరపరచాల్సి వచ్చిందో? సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తాజాగా రివీల్ చేసారు.

సినిమాలో ప్రధాన అతిథి పాత్రలకు వారి నేపథ్యం, వ్యక్తిత్వానికి అనుగుణంగా సంగీతాన్ని రూపొందించినట్లు అనిరుధ్ తెలిపారు. మంగళూరు నేపథ్యమున్న శివరాజ్‌కుమార్ పాత్రకు ఆ మట్టి వాసన ప్రతీంబించేలా లోకల్ టచ్ ఉన్న సంగీతాన్ని ఇవ్వగా, మోహన్‌లాల్ పాత్రకు మాత్రం భిన్నమైన శైలిని ఎంచుకున్నట్లు చెప్పారు. మోహన్‌లాల్ పోషించిన మాథ్యూ పాత్ర బొంబాయిలో బంగారు వ్యాపారం చేసే డాన్ కావడం వల్ల, ఆ పాత్రకున్న వైభవం , గ్లామర్‌కు సరిపోయేలా ప్రసిద్ధ డాన్ పాబ్లో తరహాలో  స్టైలిష్ బీజీఎమ్ క్రియేట్ చేసినట్లు వెల్లడించారు. థియేటర్లలో ఈ మ్యూజిక్  వర్కవుట్ అవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన `జైలర్` విజయంలో మోహన్‌లాల్ పాత్ర, దానికి తోడైన అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకుల నుండి ఈ పాత్రకు అద్భుతమైన స్పందన లభించింది. కాగా ఈ సిరీస్‌లో రానున్న రెండవ భాగం `జైలర్ 2` అక్టోబర్ 15న విడుదలవుతుంది.

Anirudh Ravichander has opened up about creating the background score