ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tanishaa Mukerji sensational accusation over Electricity Board

సెలబ్రిటీకే ఈ కష్టాలా?

Tanishaa Mukerji sensational accusation over Electricity BoardTanishaa Mukerji sensational accusation over Electricity Board

బాలీవుడ్ నటి కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్  అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోనావాలాలోని తన ఇంట్లో గడువు తేదీ కంటే ముందే కరెంటు బిల్లు చెల్లించినా? అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని ఆరోపించారు. మహారాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు మాఫియాలా ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమయానికి బిల్లులు చెల్లిస్తున్న పౌరులకు విద్యుత్ బోర్డు నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఎత్తిచూపారు. ఎలాంటి కారణం లేకుండా తన ఇంటికి కరెంటు కట్ చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను  అభ్యర్థించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సోషల్ మీడియాలో తనీషా చేసిన ఈ పోస్ట్  వైరల్‌గా మారడమే కాకుండా విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర చర్చకు దారితీసింది. సెలబ్రిటీలకే ఇలాంటి అనుభవాలు ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సమయానికి బిల్లులు చెల్లించినా వేధింపులకు గురిచేసే ధోరణి మారాలని డిమాండ్ చేస్తున్నారు.

Tanishaa Mukerji