ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Yesterday night episode highlight

బిగ్ బాస్ 10: హౌస్ మేట్స్ గొడవ పీక్స్ లో

Bigg Boss 10: Yesterday night episode highlight Bigg Boss 10: Yesterday night episode highlight


బిగ్ బాస్ సీజన్ 10 నాలుగో వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. రెడ్ టీమ్, ఎల్లో టీమ్ గా విభజించి రణరంగంలో రథ నిర్మాణం మొదలైంది అనే టాస్క్ పెట్టగా ఈ టాస్క్ లో తోసుకోవడం, తన్నుకోవడం అంటూ హౌస్ మేట్స్ నానా రకాలుగా గొడవపడ్డారు. షాలిని అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అపూర్వకు మద్యన తీవ్రమైన వాగ్వాదం జరిగింది.

ఆతర్వాత సిగ్గులేకుండా ఒక్కదానిపై ఎటాక్ చేసారు అంటూ షాలిని తన ఫ్రెండ్ రోహిత్ పై గొడవేసుకుంది. అంతేకాదు అమన్ ఇంకా షాలిని ఇద్దరి మద్యన వాదులాట జరిగింది. ఇక హౌస్ లో మొదటినుంచి ఒకరంటే ఒకరికి పడని త్రిగుణ ఇంకా రోహిత్ ఈ టాస్క్ లో గొడవ పడుతూ కొట్టుకునేవరకు వెళ్లారు.

త్రిగుణ ఇంకా రోహిత్ గొడవ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. వారిద్దరూ గొడవపడుతుంటే హౌస్ మేట్స్ కూడా అలా చూస్తూ ఉండిపోయారు. ఒకొనొక సమయంలో హౌస్ మేట్స్ గొడవెందుకు పడుతున్నారో అనేది ఆడియన్స్ కి కూడా క్లారిటీ లేకుండా పోయింది అంటే హౌస్ ఎంత రచ్చగా మారిందో అర్ధమవుతుంది.  

Bigg Boss 10