కేవలం నాని పై నమ్మకమే!

Audience hopes on NaniAudience hopes on Nani

 

హీరో నాని పై ఎంత నమ్మకం లేకపోతె డివైడ్ టాక్ తో ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ది ప్యారడైజ్ అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. నాని అంటే నిర్మాతలకే కాదు ప్రేక్షకుల్లోనూ బోలెడంత నమ్మకం. ఆయన సినిమా హిట్ అవ్వకపోయినా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యదు అని. అందుకే ది ప్యారడైజ్ కి ఆ మాత్రం క్రేజ్.

ప్యారడైజ్ ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. నాని కాబట్టి రెండు రేటింగ్ ఇచ్చాం, అదే చిన్న హీరో ఎవరైనా అయితే 1.5 రేటింగ్ ఇచ్చేవాళ్లమంటూ చాలామంది సినీవిమర్శకులు బహిరంగంగానే కామెంట్స్ చేసారు. మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్ భారీగా ఉండడంతో ప్యారడైజ్ కి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయనుకున్నారు.

రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు కూడా ప్యారడైజ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్ఛాయంటే నాలుగు రోజులకే ప్యారడైజ్ 80 శాతం రికవరీ చేసేలా. ఇక మండే కూడా ప్యారడైజ్ థియేటర్స్ లో డే షోస్ కి ఫుల్ ఆక్యుపెన్సీ లేకపోయినా నైట్ షోస్ చాలాచోట్ల ఫుల్ అయ్యాయి అంటే అది నాని పై ఆడియన్స్ లో ఉన్న నమ్మకమే.

సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటి ఉన్నా నాని సినిమా యావరేజ్ అన్నా బావుంటుంది అనే కాన్ఫిడెన్స్ ని ఆడియన్స్ ప్యారడైజ్ విషయంలో నిజం చేసి చూపించారు. 

Hero Nani