ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jailer 2 vs. Ramayana: Pre-release clash!

జైల‌ర్ -2 vs రామాయ‌ణం: రిలీజ్ కు ముందే వార్!

Jailer 2 vs. Ramayana: Pre-release clash!Jailer 2 vs. Ramayana: Pre-release clash!

 

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ చిత్రాలు `రామాయణం`, `జైలర్ 2` బాక్సాఫీస్ సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలు థియేటర్లలోకి రాకముందే తెలుగు చిత్రసీమలో ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రెండు చిత్రాలకు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు థియేట్రికల్ హక్కుల కొనుగోలు కోసం నైజామ్, ఆంధ్రా వ్యాపార వర్గాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది.

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం` తెలుగు హక్కుల వ్యాపారం 100 కోట్ల రూపాయల అంచనాతో సాగుతోంది. ఈ చిత్రానికి ఉన్న గ్లోబల్ అప్పీల్, తెలుగులో ఉన్న మార్కెట్ పొటెన్షియల్‌ను గుర్తించి  నిర్మాత దిల్ రాజు  హక్కులను అడ్వాన్స్ బేసిస్‌పై దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ దిశగా చర్చలు కూడా వేగవంతంగా జరుగుతున్నట్లు స‌మాచారం.

మరోవైపు సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న `జైలర్ 2` కూడా వ్యాపార పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. తొలి భాగం `జైలర్` తెలుగు రాష్ట్రాల్లో సాధించిన సంచలన విజయం దృష్ట్యా సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం ఏకంగా 90 కోట్ల రూపాయల బిజినెస్ డీల్ జరుగుతుండటం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ విధంగా విడుదలకు ముందే రెండు సినిమాలు కలిపి 190 కోట్ల రూపాయల రేంజ్‌లో తెలుగు బిజినెస్ ధమాకా సృష్టిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. నాన్-స్ట్రైట్ సినిమాలకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం విశేషం. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాలు పోటీపడితే ప్రేక్షకుల ఆదరణతో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.

Jailer 2 vs. Ramayana