ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: Mithilesh walks out with Rs 15 lakh

BB10: మిథిలేష్ వెళ్ళాక కొట్టుకోబోయిన హౌస్ మేట్స్

Bigg Boss Telugu 10: Mithilesh walks out with Rs 15 lakhBigg Boss Telugu 10: Mithilesh walks out with Rs 15 lakh


బిగ్ బాస్ సీజన్ 10 మూడో వారంలో హౌస్ మేట్స్ కి 5 లక్షల ఆఫర్ చేసారు హోస్ట్ నాగ్. కానీ హౌస్ మేట్స్ టెంప్ట్ అవ్వలేదు. రూ,10 లక్షలు అన్నారు, అయినా హౌస్ మేట్స్ టెంప్ట్ అవ్వలేదు. రూ.15 లక్షలు అనగానే మిథిలేష్ నేను తీసుకుని వెళ్ళిపోతా అంటూ ముందుకొచ్చాడు. వైల్డ్ కార్డు గా రెండు రోజుల క్రితమే అతను హౌస్ లోకి వచ్చాడు.

అయితే మిథిలేష్ హౌస్ నుంచి రూ.15 లక్షలు పట్టుకెళ్ళడం ఎవరికి ఇష్టం అంటే చాలామంది చేతులు ఎత్తారు. దానితో మిథిలేష్ హౌస్ మేట్స్ సపోర్ట్ తో రూ.15 లక్షలు తీసూని హౌస్ నుంచి వెళ్ళిపోయిన ప్రోమో వదిలారు. మిథిలేష్ వెళ్ళగానే త్రిగుణ వచ్చి రెండు రోజులు అవ్వలేదు విన్నర్ ప్రైజ్ నుంచి 15 లక్షలు తీసుకెళ్లిపోతాడట వీళ్ళు చేతులెత్తుతారట సిగ్గులేదు అంటూ స్టార్ట్ చెయ్యడమే కాదు జబర్దస్త్ రామ్ ప్రసాద్ తో నువ్వెలా పంపిస్తావ్ అంటూ గొడవపడ్డాడు.

ఆతర్వాత ముఖేష్ గౌడ్ అమన్ ని కూడా విన్నర్ ప్రైజ్ మనీ నుంచి ఎలా ఇస్తారు, అదేమీ ప్రొడక్షన్ డబ్బులు కాదు అనగానే ఆ మనీ నాది అన్నాడు త్రిగుణ, దానికి అమన్ కూడా నాది కూడా.. మూసుకుని పడుకో అంటూ మాట జారాడు. ఆతర్వాత ఒకరికొకరు తోడుసుకోవడం, మధ్యలో అమన్ వంశి ని నెట్టెయ్యడం అన్ని ఈరోజు ఆదివారం ఎపిసోడ్ ప్రోమో లో హైలెట్ అయ్యాయి. 

Mithilesh self eliminated for 15 lakhs temptation offer