వైరల్: రామాయణ అఫీషియల్ పోస్టర్
Ramayana Official Poster Released
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రం పై ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణ్ గా తెరకెక్కిన రామాయణ పార్ట్ 1 చిత్రం ఈ దీపావళికి రిలీజ్ అవుతుంది.
దానితో మేకర్స్ రామాయణ ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తున్నారు. రీసెంట్ గా రామాయణ నుంచి మొదటి పాట ను వదిలిన మేకర్స్ నేడు అఫీషియల్ పోస్టర్ ని విడుదల చేసారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, లక్ష్మణుడిగా రవి దూబే రామాయణ పోస్టర్ లో అద్భుతంగా కనిపించారు.
ఇక రావణ్ కేరెక్టర్ చెయ్యడానికి యశ్ ఒప్పుకోవడం మాములు విషయం కాదు, అందరూ ద్వేషించే ఆ పాత్రను చెయ్యడానికి ఓ స్టార్ ముందుకు రావడం చాల గొప్ప విషయం. రావణ్ కేరెక్టర్ చెయ్యడమే కాదు యశ్ ఈ చిత్ర నిర్మాణంలో భాగమై రామాయణకు వెన్నుముఖలా నిలిచారు. యశ్ లేని రామాయణ జర్నీ అసంపూర్ణం అంటూ నిర్మాత నమిత్ మల్హోత్రా పేర్కొన్నారు.
















































