ఎట్టకేలకు ఓటీటీలోకి ఇండస్ట్రీ హిట్
Bethlehem Kudumba Unit OTT release date confirmed
ఎప్పుడో ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి రావాల్సిన మలయాళ ఇండస్ట్రీ హిట్ మూవీ బెత్లెహెం కుటుంబ యూనిట్ చిత్రం ఇప్పటికి ఓటీటీ జాడ లేదు. మలయాళ ఇండస్ట్రీ నిబంధనల ప్రకారం ఈ చిత్రం గత వారమే ఓటీటీ లోకి రావాల్సి ఉండగా.. థియేటర్స్ లో బ్లక్ బస్టర్ హిట్ అవడంతో ఓటీటీ రిలీజ్ ని మేకర్స్ వాయిదా వేసారు.
మలయాళం లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా స్ట్రాంగ్ బెంచ్ మార్క్ సెట్ చేసింది. నివిన్ పౌలి-మమిత బైజు జంటగా ప్రేమలు డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్.
అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో.. బెత్లెహెం కుటుంబ యూనిట్ ఓటీటీ రిలీజ్ పై ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ డీల్ తో చేజిక్కించుకున్న జియో హాట్ స్టార్ అక్టోబర్ 2 నుంచి బెత్లెహెం కుటుంబ యూనిట్ స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
















































