ఒక్క సినిమాతోనే సినీ కెరీర్‌కు ముగింపు!
Gayatri Oberoi was just 28 when she got marriedబాద్‌షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన `స్వదేస్` చిత్రం తో నటి గాయత్రి జోషి ఇండస్ట్రీలో సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. తొలి చిత్రంతోనే `గీత` అనే గ్రామీణ ఉపాధ్యాయురాలి పాత్రలో సహజ అభినయంతో విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అంత స్టార్ డమ్ దక్కినా? ఆ ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌కు స్వస్తి పలికి ఆశ్చర్యానికి చేసారు.
గ్లామర్ ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ గాయత్రి వ్యక్తిగత జీవితానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకున్న గాయత్రి సినీ రంగం ఇచ్చే వెలుగుల కంటే కుటుంబంతో గడిపే ప్రశాంతమైన జీవితమే మిన్న అని భావించారు. భర్త, ఇద్దరు కుమారుల పెంపకానికి, కుటుంబ బాధ్యతలకు సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకుని వినోద పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు.
ఒక్క సినిమాతోనే ముగిసిన సినీ ప్రయాణం గురించి గాయత్రి ఎప్పుడూ విచారం వ్యక్తం చేయలేదు. కెరీర్ ప్రారంభంలోనే తప్పుకున్నందుకు పశ్చాత్తాపం లేదని కుటుంబంతో ఆనందంగా గడపడంలోనే తనకు నిజమైన ఆత్మసంతృప్తి లభించిందని స్పష్టం చేశారు. నేటికీ `స్వదేస్` సినిమా తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గాయత్రి ఒబెరాయ్, లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్నాన? బాలీవుడ్‌లో చిరస్మరణీయమైన నటిగా నిలిచిపోయారు.
















































