ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Nagarjuna fires on Sudheer

BB10: సుధీర్ కి స్ట్రాంగ్ గా ఇచ్చేసిన నాగ్

Bigg Boss 10: Nagarjuna fires on SudheerBigg Boss 10: Nagarjuna fires on Sudheer


బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ వారం నామినేషన్స్ లో పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా సృష్టి ఇంకా సుధీర్ మధ్యన జరిగిన గొడవను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అదే హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో ఎక్స్పోజ్ చేసారు. ఈరోజు శనివారం. నాగార్జున వస్తారు, హౌస్ మేట్స్ తాట తీస్తారు.

నాగ్ వచ్చారు. రావడం రావడమే సృష్టిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. నువ్వు సుధీర్ పై అలా చెత్తవేయ్యకుండా ఉండిఉంటే నువ్వు బంగారం. ఎందుకు అలా చేసావ్, అది ఎవ్వరికి నచ్చలేదు, నీలాంటి అమ్మాయి అందరి ఇంట్లో ఉండాలనుకుంటారు. కానీ ఎందుకు సృష్టి అనగానే 14 డేస్ నన్ను వాడుకుని అంటూ ఏడ్చేసింది.

ఇక సుధీర్ ని కూడా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి గట్టిగా ఇచ్చిపడేసారు. నువ్వు పాడ్ క్యాస్ట్ లు చేస్తావా, వర్షిణి దగ్గరకు వెళ్లి నాకు బయట ఐదు మంది అమ్మాయిలు ఉన్నారు. నేను సృష్టితో ప్రాక్టీస్ చేస్తున్నా అని మాట్లాడావ్, అది ఏ అమ్మాయి విన్నా ఎలా ఉంటుందో తెలుసా, అవును ఏదో ఫ్రీడమ్ వచ్చింది అన్నావ్ ఏంటి అంటూనే మీ ఇద్దరు త్రిగుణ, రోహిత్ ఆటలో పావుల్లా మారి బలవుతున్నారు అటూ సుధీర్ ని నాగ్ ఈ ఎపిసోడ్ లో గట్టిగానే ఏసుకున్నారు.

Sudheer vs Srishti Fires Issue In Bigg Boss 10