కాక పై ఉన్న కాన్ఫిడెన్స్ విశ్వంభరపై లేదా?
Chiranjeevi not confident about Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి కి బాబీ దర్శకత్వంలో చేస్తున్న కాక చిత్రం పై ఉన్న కాన్ఫిడెన్స్ వశిష్ట డైరెక్షన్ లో చేసిన విశ్వంభర పై లేదా.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. చిరు లాంటి హీరో కే రెండు సినిమా విడుదల విషయంలో వచ్చిన కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వలేదు అంటే ఏమనుకోవాలి.
అయినా చిరు కాక గురించే ఎప్పుడు మాట్లాడుతున్నారు కానీ.. హైప్ మొత్తం దొబ్బి మరుగున పడిపోతున్న విశ్వంభర ఊసు తియ్యకపోవడమే చాలామందిలో చాలా రకాల అనుమానాలకు ఆజ్యం పోసింది. మెగా ఫ్యాన్స్ కూడా బయటపడడం లేదు కానీ.. చిరు విశ్వంభర ముచ్చట తీయకపోవడం వారికి కూడా ఇబ్బందిగానే ఉంది.
మరి చిరు కూడా కాక పై ఉన్న కాన్ఫిడెన్స్ తో లీక్స్ వదులుతున్నారు కానీ.. విశ్వంభర పై నమ్మకం లేకనే నోరు మెదపడం లేదా, ఏది ఏమైనా విశ్వంభర విడుదల తేదీ విషయములో జరుగుతున్న చర్చ ఈమధ్య కాలంలో మరే ఇతర సినిమాపై జరగలేదు అంటే నమ్మాల్సిందే.
















































