BB10: 1st వీక్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్
Bigg Boss Telugu 10 Double Elimination Twist
బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యి పది రోజులు కావొస్తుంది. మొదటి వారం గడవకముందే కామనర్స్ లో నుంచి చరణ్ ని హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేయగా... సెలబ్రిటీస్ నుంచి చైత్ర రాయ్ ని ఎలిమినేట్ చేసారు. అయితే మొదటి వారం లోనే ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయడంపై హౌస్ మేట్స్ లోనే అనుమానాలు మొదలు కాగా.. వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగ్ చైత్ర ఇంకా చరణ్ సీక్రెట్ రూమ్ లో లేరు, వారు నేరుగా ఇంటికెళ్లిపోయారని చెప్పారు.
చైత్ర రాయ్ అలాగే చరణ్ లతో హౌస్ మేట్స్ ని మట్లాడనిచ్చారు. దానితో వారిద్దరూ అవుట్ అని హౌస్ మేట్స్ మాత్రమే కాదు, బుల్లితెర ఆడియన్స్ కూడా నిజమే అనుకున్నారు. కట్ చేస్తే చైత్ర రాయ్, చరణ్ ఎలిమినేట్ కాలేదు. వారు మళ్లీ హౌసులోకి వచ్చే అవకాశం ఉంది, వారిలో ఎవరిని హౌస్ కి రీ ఎంట్రీ ఇప్పించాలనుకుంటున్నారో ఓటింగ్ పెట్టారు.
గత రాత్రి నుంచే చరణ్, చైత్ర రాయ్ ల ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ వారం వీకెండ్ లో వీరిద్దరిలో ఒకరు రీ ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. లేదంటే ఇద్దరూ రావొచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న త్రిగున్ ఇంకా కామనర్ రోహిత్ లు పోటాపోటీగా ఓటింగ్ లో దూసుకుపోతున్నారు.
















































