పల్నాడులో ఫ్లెక్సీల రగడ

Edlapadu Flexi WarEdlapadu Flexi War

 

ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే రాజకీయపార్టీల నడుమ వేడి రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు టిడిపి, జనసేన, బిజెపి, వైఎసార్సీపీ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. పార్టీల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పోటీలో గెలిచేందుకు వ్యవహారచనలు మొదలు పెట్టేశాయి.

అంతేకాదు కూటమి పార్టీలు vs వైఎసార్సీపీ పార్టీల నడుమ యుద్దాలు కూడా మొదలయ్యాయి. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్తానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ఫిక్స్ అవడమే కాదు.. తన నేతలకు గైడ్ లెన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పల్నాడులో ఫ్లెక్సీల ఫైటింగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

‘జగన్‌ వస్తాడు’ vs ‘రాడు.. రానీయం’..!  అంటూ చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలంలో వైఎస్సార్‌ వర్ధంతి, పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు వెలిసాయి. 2029లో జగన్‌ మళ్లీ సీఎంగా వస్తాడు.. మీకు చేతనైతే ఆపుకోండి అంటూ వైసీపీ వర్గాల ఫ్లెక్సీలు పెట్టగా..  వైసీపీ ఫ్లెక్సీలకు కౌంటర్‌గా రాడు.. రానీయం అంటూ కూటమి వర్గాల ఫ్లెక్సీలు పెట్టడం కలకలం సృష్టించింది.

మరి 2029 రాజకీయాలపై ఫ్లెక్సీల రూపంలో సాగుతున్న వార్ సోషల్‌ మీడియాలో మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది.

Flexi Fight Between YCP and TDP in Palnadu District.